Home తెలంగాణ హ్యామ్ రోడ్ల పైలాన్‌ను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

హ్యామ్ రోడ్ల పైలాన్‌ను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

VGన్యూస్: గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి ప్రణాళికకు ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,145 గ్రామీణ రహదారుల అభివృద్ధికి శుభారంభం పలికారు. గ్రామీణ రహదారుల అభివృద్ధికి సంబంధించి పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో ములుగు జిల్లా గట్టమ్మ ఆలయం ఎదురుగా నిర్మించిన హ్యామ్ రోడ్ల పైలాన్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. గ్రామ పంచాయతీల నుంచి మండల కేంద్రాలు, రాష్ట్రంలోని ప్రధాన రహదారులకు రోడ్లను అభివృద్ధి చేసి అనుసంధానం చేసే ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ రవాణా రంగంలో సరికొత్త అధ్యాయానికి ములుగు కేంద్రంగా తొలి అడుగు పడిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.