VGన్యూస్: తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామంలోని శ్రీ సురమాంబ కంఠమహేశ్వర స్వామి వారిని బుధవారం నాడు బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కల్లుగీత కార్మికుల కోసం నీరా కేఫ్ లను ఏర్పాటు చేయాలన్నారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమని స్పష్టం చేశారు. కల్లు గీత కార్మికుల అభివృద్ధి, సంక్షేమం కోసం మరిన్ని పథకాలు తీసుకొస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మేడ్దుల రమేష్, మొల్కాపురి శ్రీకాంత్ గౌడ్, వర్ధెల్లి లింగయ్య, వగలగాని దశరథ, వగలగాని లింగయ్య, వగలగాని వెంకన్న, వగలగాని వీరయ్య, వగలగాని సుదర్శన్, వర్ధెల్లి సత్తయ్య, వర్ధెల్లి వీరభద్రం, గుండగాని సందీప్, వగలగాని రాము తదితరులు పాల్గొన్నారు.










