సీపీఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం
సీపీఐ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం పేరు ఆ పార్టీ ఖరారు చేసింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించిన తర్వాత సత్యం పేరును ఆదివారం రాత్రి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రకటించారు. కాంగ్రెస్ , సీపీఐ ఎన్నికల పొత్తులో భాగంగా హస్తం పార్టీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాన్ని సీపీఐకి కేటాయించింది.
ఛాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో టీంఇండియా ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ తో జరిగిన తుదిపోరులో భారత జట్టు 4 వికెట్ల తేడాతో గెలించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 251 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన టీంఇండియా 49 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం ఇది మూడోసారి.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు
భారాస ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థి పేరును ఖరారు చేసింది. ఆ పార్టీ సీనియర్ నేత డా. దాసోజు శ్రవణ్ పేరును బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్
తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, కె.శంకర్ నాయక్, విజయశాంతి పేర్లను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మరో ఎమ్మెల్సీ స్థానాన్ని సీపీఐకి కేటాయించినట్లు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు.
తరతరాలకు స్ఫూర్తి ‘కొణిజేటి’
ఆరడుగుల ఎత్తు... అచ్చ తెలుగు పంచెకట్టు... నిండైన ఆహార్యం ... ముఖంపై చిరునవ్వు... ఆర్థిక, రాజకీయ క్రమశిక్షణకు మారుపేరు... బహుముఖ ప్రజ్ఞాశాలి... స్వపక్షంతోనే కాదు విపక్షంతోనూ మన్ననలు పొందిన గొప్ప నాయకుడు కొణిజేటి రోశయ్య. ఎంత ఎదిగినా ఒదిగే ఉండే మనస్తత్వం. రాజకీయాల్లో మచ్చలేని మహానేత. సూటిగా సుత్తి లేకుండా చెప్పడంలో ఆయన దిట్ట. మనిషి సాదాసీదాగా కనిపించినా... ప్రత్యర్థులకు మాత్రం రోశయ్య ఒక సింహస్వప్నం. ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రోశయ్యకు ప్రత్యేకమైన స్థానం ఉంది. సామాన్య కార్యకర్తగా రాజకీయ రంగ...
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారీతో తెలంగాణ గాంధీ భూపతి కృష్ణమూర్తి గారు
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారీతో తెలంగాణ గాంధీ భూపతి కృష్ణమూర్తి గారు
తెలంగాణలోని ఆర్యవైశ్య అన్నదాన సత్రాలు
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలో ఉన్న ఆర్యవైశ్య అన్నదాన సత్రాల వివరాలు... శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వాసవి నిత్యాన్నసత్రం, సురేంద్రపురి, యాదగిరిగుట్ట దగ్గర, యాదాద్రిభువనగిరి జిల్లా 9848363533, 9553777888 శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆర్యవైశ్య నిత్యాన్న సత్ర సంఘం, యాదగిరిగుట్ట, యదాద్రి భువనగిరి జిల్లా 08685-236670, 236675 శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్ర ధర్మపురి ఆర్యవైశ్య వాసవి నిత్యాన్నసత్రం, ధర్మపురి,కరీంనగర్ జిల్లా 08724-273201, 9676203264 శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య వాసవి నిత్యాన్న సత్రం సంఘం, వేములవాడ, రాజన్నసిరిసిల్ల జిల్లా 08723-236207, 236208 శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య వాసవి అన్నపూర్ణ నిత్యాన్న సత్రం సంఘం,...
ఆంధ్రప్రదేశ్ లోని ఆర్యవైశ్య అన్నదాన సత్రాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ జిల్లాలో ఉన్న ఆర్యవైశ్య అన్నదాన సత్రాల వివరాలు... వాసవి సత్రం, శ్రీశైలం , కర్నూలు జిల్లా 08524-287140, 9440624150 వాసవి విహార్ , శ్రీశైలం , కర్నూలు జిల్లా 8500124154, 08524-288114 అఖిలభారత శ్రీశైల క్షేత్ర ఆర్యవైశ్య నిత్య అన్నపూర్ణ సత్రం , శ్రీశైలం 08524-287158, 9490197035 మహానంది క్షేత్ర ఆర్యవైశ్య నిత్యాన్న సత్ర సంఘం, దిగువ అహోబిలం 08519-252015, 9491412192, శ్రీమత్ పెద్ద అహోబిళ ఆర్యవైశ్య అన్నసత్రం, ఎగువ అహోబిళం 08519-220036, 040-23313796, 9440205489 ఆర్యవైశ్య సేవా సంఘం, మంత్రాలయం 08512-279436 శ్రీ వల్లి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆర్యవైశ్య అన్నదాన సత్రం , సుబ్బారాయుని కొత్తూరు ,...
వివిధ రాష్ట్రాల్లోని వైశ్య అన్నదాన సత్రాలు
భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లోని ఆర్యవైశ్య నిత్య అన్నదాన సత్రాల వివరాలు... శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం ,వారణాసి 9246822788 శ్రీ కాశీ అన్నపూర్ణ వాసవి ఆర్యవైశ్య వృద్ధాశ్రమం మరియు నిత్యాన్న సత్రం , వారణాసి, ఉత్తరప్రదేశ్ 0542-2400076, 2455087, 08335332133 శ్రీ కాశీ ఆర్యవైశ్య వాసవి నిత్యాన్న సత్రం, వారణాసి 0542-2451534, 09936443603 శ్రీ కాశీ వైశ్య సత్రం సంఘం(గుంటూరు వారిది) వారణాసి 0542-2452947 శ్రీ హేమ సాయిరామ్ అన్నపూర్ణ ఛారిటబుల్ ట్రస్టు, వారణాసి(సైకిల్ స్వామి) 09598526301, 09795169495 శ్రీ వాసవి గంగా గోదావరి నిత్యాన్న సేవా సంఘం, వారణాసి 0542-2450236 సాయి విశ్వనాథ అన్నపూర్ణ సేవా సమితి,...
తెలంగాణ గాంధీ భూపతిని గౌరవించాలి
చిన్ననాటి నుంచే దేశభక్తి, క్రమశిక్షణ, నిజాయితీ, నిరాడంబరత, నిస్వార్థ సేవ, ఉద్యమ భావాలు కలిగిన మహానియుడు. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొని క్రీయాశీలకంగా పనిచేశారు. స్వాతంత్ర్యం అనంతరం జరిగిన తొలి, మలిదశ తెలంగాణ ఉద్యమాల్లోనూ పాల్గొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కనులారా చూసిన పోరాటయోధుడు. తన ఆస్తులను ఉద్యమాలకే దారపోసిన ధీరోదాత్తుడు. ఆయన జీవితం అంతా పోరాటమే... బతుకంతా ఉద్యమాలే. నిస్వార్థంగా పోరాడటమే తప్ప పేరుప్రఖ్యాతలు, పదవులు ఆశించని మహా మనిషి... మనమందరం తెలంగాణ గాంధీగా పిలుచుకునే గొప్ప పోరాటశీలి భూపతి...