Home తాజా వార్తలు విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దాల్సిన బాధ్యత అధ్యాపకులదే : సీఎం రేవంత్ రెడ్డి

విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దాల్సిన బాధ్యత అధ్యాపకులదే : సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో నిరుద్యోగుల పాత్ర చాలా క్రియాశీలకమైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన “ప్రజా ప్రభుత్వంలో కొలువుల పండుగ” కార్యక్రమానికి మఖ్యఅతిథిగా సీఎం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్ కళాశాలలో లెక్చరర్ల ఉద్యోగాలకు ఎంపికైన 1532 మంది అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  నియామక పత్రాలు అందజేశారు. ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్న అభ్యర్థులందరికీ సీఎం అభినందనలు తెలియజేశారు. తెలంగాణ పునర్నిర్మాణంలో అందరూ కంకణబద్ధులై పనిచేయాలిని సూచించారు. దేశ భవిష్యత్తు విద్యా శాఖతో ముడిపడి ఉందన్నారు. విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దాల్సిన బాధ్యత అధ్యాపకులపై ఉందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here