తెలుగు రాష్ట్రాల్లో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. ప్రజాప్రతినిధులు, ఆర్యవైశ్య సంఘాల నేతలు పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే పొట్టి శ్రీరాములు త్యాగాన్ని, పోరాట పటిమను గుర్తు చేసుకున్నారు.