ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం ఉద్యోగులకు రూ.6,200 కోట్లు చెల్లించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
గత ఏడాది తెలంగాణలో నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. టీజీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్లో అభ్యర్థులు తమ లాగిన్ వివరాలతో మార్కులు చూసుకోవచ్చు.