Home తాజా వార్తలు పాలిసెట్ ఫలితాలు విడుదల

పాలిసెట్ ఫలితాలు విడుదల

VGన్యూస్: తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ (పాలిటెక్నిక్) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్షలో 82.94 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.

మీ సేవ వాట్సాప్ ద్వారా TGPOLYCET ఫలితాలు తెలుసుకునే విధానం:                                                                     1. TGPOLYCET ఫలితాలు అధికారిక మీ సేవ తెలంగాణ వాట్సాప్ నంబర్ (8096958096) ద్వారా నేరుగా అభ్యర్థులకు పంపబడతాయి.
2. ఇది అవుట్‌బౌండ్ సేవ కావున, అభ్యర్థులు ఎటువంటి అభ్యర్థన చేయాల్సిన అవసరం లేదు.
3. ఫలితాలు అధికారికంగా విడుదలైన వెంటనే, అర్హత గల అభ్యర్థులు ఆటోమేటిక్‌గా ఫలితాల సమాచారాన్ని అందుకుంటారు.
4. ఫలితాలు అభ్యర్థుల రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్‌కు వాట్సాప్ ద్వారా PDF రూపంలో పంపబడతాయి.
5. అభ్యర్థులు ఫలితాలను తక్షణమే వీక్షించి, డౌన్‌లోడ్ చేసుకుని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరుచుకోవచ్చు.
ఈ వినూత్న కార్యక్రమం ద్వారా విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులకు పరీక్షలకు సంబంధించిన సేవలు వేగవంతంగా, సురక్షితంగా మరియు పారదర్శకంగా నేరుగా అందుబాటులోకి వస్తాయి.