Home జాతీయం & అంతర్జాతీయం కాలుష్య వ్యర్ధాలను పూర్తిస్థాయిలో శుద్ధి చేయాలి: డిప్యూటీ సీఎం

కాలుష్య వ్యర్ధాలను పూర్తిస్థాయిలో శుద్ధి చేయాలి: డిప్యూటీ సీఎం

VGన్యూస్: గోదావరి నదిలో పెరిగిపోతున్న కాలుష్యాన్ని నివారించేందుకు పారిశ్రామికవేత్తలు కూడా తగిన విధంగా సహకరించాలి అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా పారిశ్రామికవేత్తలతో డిప్యూటీ సీఎం ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. పరిశ్రమల నుంచే వ్యర్ధాలు నేరుగా నదీ జలాల్లో కలపకూడదనే నిబంధన ఉందన్నారు. ప్రతి పరిశ్రమ శుద్ధి ప్లాంటు నిర్వహణ తప్పనిసరి చేసుకోవాలని స్పష్టం చేశారు. వ్యర్ధాలను ఆధునిక పద్ధతులను ఉపయోగించి పూర్తిస్థాయిలో శుద్ధి చేసిన తర్వాత మాత్రమే విడుదల చేయాలని సూచించారు.

తాగు, సాగునీటికి వినియోగించే నీటిలో కాలుష్యకారక వ్యర్ధాలు కలపడం వల్ల తీవ్రమైన సమస్యలు వస్తాయని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. వీటిని పూర్తిస్థాయిలో దృష్టిలో పెట్టుకొని కాలుష్య వ్యర్ధాలను పూర్తిస్థాయిలో శుద్ధి చేయాలని ఆదేశించారు. ఇక నుంచి తప్పనిసరిగా ప్రతి 3 నెలలకు ఒకసారి కాలుష్యంత్రణ మండలి ప్రతి పరిశ్రమను ఆడిట్ చేస్తుంది స్పష్టం చేశారు. మన సంస్కృతి సంప్రదాయం, నదుల్లో ఇమిడి ఉంటుందన్నారు. వాటిని రక్షించుకోవడం మన అందరీ బాధ్యతగా భావిద్దామని చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, తదితరులు పాల్గొన్నారు.