VGన్యూస్: తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభ వార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 290 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన మూడు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసింది. అందులో రోడ్లు, భవనాల శాఖలో 222 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్), 49 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్), తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో 19 అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ పోస్టులు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.







