VGన్యూస్: సూర్యాపేట జిల్లా మోతే మండల పరిధిలోని రాఘవాపురం గ్రామానికి చెందిన దుశ్చర్ల సత్యనారాయణ ప్రకృతి, పర్యావరణ ప్రేమికుడు. ఆయన తనకు ఉన్నటువంటి 70 ఎకరాల భూమిలో వందలాది చెట్లను పెంచి ప్రకృతి, పర్యావరణం పై తన ప్రేమను చాటుకున్నాడు. ఆయన సృష్టించిన ఈ కృత్రిమ అడవి వేలాది పక్షులు, జంతువులకు నిలయంగా మారింది. ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా మొక్కలు నాటి పర్యావరణంను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు సత్యనారాయణ.







