VGన్యూస్: రైతులు వరి కోతలు ముగిసిన తర్వాత కొయ్యలకు నిప్పు పెట్టడం ద్వారా పర్యావరణానికి పెను ముప్పుగా మారుతుంది. ఆ మంటల వల్ల పచ్చని చెట్లు కూడా అగ్నికి ఆహుతి అవుతున్నాయి. ఎంతో విలువైన మోటారు సామాగ్రి, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. అధికారులు రైతులకు వరి కొయ్యలకు నిప్పు పెట్టడం వలన పర్యావరణానికి కలిగే నష్టాలను వివరించి.. ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని పర్యావరణ పరిరక్షణ ప్రేమికులు కోరుకుంటున్నారు.







