VGన్యూస్: విజయవాడ నగరానికి చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త గుడిపాటి సీతారామ్ జనసేన పార్టీలో చేరారు. మంగళవారం సాయంత్రం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. సీతారామ్ ని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సీతారామ్ సతీమణి, యువ గాయని శ్రీలలిత పాల్గొన్నారు.










