తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. ఉదయం నుంచే ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, యువత, మహిళలు, చిన్నాపెద్దా అంతా కలిసి రంగులు చల్లుకుంటూ హోలీ వేడుకలను జరుపుకున్నారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన బీఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈనెల 27 వరకు శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఈనెల 19న...