VG న్యూస్: జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన భారత రాష్ట్ర సమితి ప్రజా ఆశీర్వాద సభలో మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జీవన్ రెడ్డికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జీవన్ రెడ్డితోపాటు తన అనుచరులు కూడా పెద్ద సంఖ్యలో భారాసలో చేరారు. అనంతరం జరిగిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ భారాస రాష్ర ప్రధాన కార్యదర్శిగా జీవన్ రెడ్డిని నియమిస్తున్నట్లు ప్రకటించారు.







