VG న్యూస్: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ రజతోత్సవ సంబరాల ముగింపును పురస్కరించుకుని ఈ నెల 27వ తేదీన ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు ఆపార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్ లో మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం ప్రారంభమైతదని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ భవిష్యత్ కార్యాచరణ, పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వాల పునరుద్ధరణ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లాల అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, పార్లమెంటు సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేషన్ల చైర్మన్లు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్లు హాజరవుతారన్నారు.






