ఎన్నో ఏళ్ల ఎస్సీ వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్న చారిత్రాత్మకమైన సందర్భమని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అన్నారు. శాసనసభలో ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సుదీర్ఘమైన వర్గీకరణ పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. చనిపోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకుంటుందని తెలిపారు. వారి కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం పథకాల్లో ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. దళితులకు అండగా ఉంటూ వారి అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందిని పేర్కొన్నారు. బిల్లు ఆమోదానికి సహకరించిన అందరికీ సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.