తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసేందుకు రాష్ట్ర సర్కారు ప్రవేశపెట్టిన బిల్లుకు మంగళవారం అసెంబ్లీ, శాసనమండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. ఎస్సీలోని 59 ఉపకులాలను మూడు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-1లోని 15 కులాలకు 1శాతం , గ్రూప్-2లోని 18 కులాలకు 9 శాతం, గ్రూప్-3లోని 26 కులాలకు 5 శాతం రిజర్వేషన్ కల్పించారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన 7 నెలలోనే రాష్ట్ర ప్రభుత్వం శాసన ప్రక్రియను పూర్తి చేసింది.