Home తెలంగాణ ఘనంగా కోదాడ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

ఘనంగా కోదాడ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

VGన్యూస్: కోదాడలో ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి జన్మదిన వేడుకలను మున్సిపల్ ఛైర్మన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్నేని కుసుమ మాట్లాడుతూ.. కోదాడ నియోజకవర్గానికి రూ.1938 కోట్ల నిధులతో రహదారులు, సాగు, తాగునీరు, విద్యా వైద్యం, గ్రామీణ, పట్టణ మౌలిక వసతుల అభివృద్ధికి ఎమ్మెల్యే కృషి చేశారన్నారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుంటూ, నిస్వార్థ సేవతో రాజకీయాలకు ఆదర్శంగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ వంగవీటి రామారావు, తదితరులు పాల్గొన్నారు.