Home తాజా వార్తలు తెలంగాణ భవన్‌లో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు

తెలంగాణ భవన్‌లో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు

VGన్యూస్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్‌లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో పలువురు తెలంగాణ కళాకారులకు సన్మానం చేశారు. కేసీఆర్ పై, తెలంగాణపై రూపొందించిన పలు పాటలను కేటీఆర్ ఆవిష్కరించారు.