VGన్యూస్: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఈడీ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం నిర్వహించే టీజీ ఎడ్ సెట్ ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు రేపు (మే 9వ తేదీన) విడుదల కానున్నాయి. అధికారిక వెబ్ సైట్ నుంచి విద్యార్థులు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మే 12న కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) పద్ధతిలో ఎడ్ సెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్ష రెండు సెషన్లలో జరుగుతుంది. మెుదటి సెషన్ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తర్వాత రెండవ సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది.










