VGన్యూస్: పార్లమెంట్‌లో బుధవారం జరిగిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ సమావేశంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో పీఎం స్వనిధి (PM SVANidhi) పథకం అమలు పురోగతిని సమీక్షించారు. వీధి వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎంపీ చామల కిరణ్ ప్రస్తావించారు. ముఖ్యంగా అర్హులైన వీధి వ్యాపారుల గుర్తింపు, లబ్ధిదారుల ధ్రువీకరణ పత్రాల జారీ, డాక్యుమెంటేషన్ ఇబ్బందులు, క్రెడిట్ కార్డుల మంజూరులో జరుగుతున్న జాప్యాలపై అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పీఎం స్వనిధి పథకం విధానాలను సరళీకృతం చేయాలని ఆయన సూచించారు.










