Home తాజా వార్తలు విద్యార్థులతో మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించిన గవర్నర్

విద్యార్థులతో మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించిన గవర్నర్

VGన్యూస్: మాదక ద్రవ్యాల మహమ్మారిని తరిమికొట్టడానికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా వాటిని నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను భాగస్వామ్యం చేసింది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థినీ విద్యార్థులతో మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్, ప్రభుత్వ సలహాదారులు కె. కేశవరావు,వి.హనుమంతరావు, సుదర్శన్ రెడ్డితో పాటు ప్రజాప్రతినిధుల పాల్గొన్నారు.