VGన్యూస్: ఆనాడు కొత్త రాష్ట్రం కాబట్టి ప్రభుత్వం మీద, పరిపాలన మీద దృష్టి పెట్టి.. పార్టీపై ఎక్కువ దృష్టి పెట్టలేకపోయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాబోయే రోజుల్లో ప్రజల సంక్షేమం, కార్యకర్తల బాగోగులు రెండిటినీ కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత తనదని స్పష్టంచేశారు. గురువారం చేవెళ్ల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం, ఎస్ఐఆర్ శిక్షణా కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే పోయినా.. ఎంపీ పోయినా.. అధికారం పోయినా చేవెళ్లలో ఇంతమంది సోదరులు ఇక్కడికొచ్చి మీరు చేస్తున్న ప్రకటన మామూలు ప్రకటన కాదు.. ఇది కాంగ్రెస్, బీజేపీ పార్టీ గుండెల్లో రైళ్లను ఉరికించే గొప్ప దృశ్యమన్నారు. ఎస్.ఐ.ఆర్ (SIR) ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పార్టీ శ్రేణులకు వివరించారు. అలాగే అర్హత కలిగిన ప్రతి ఒక్కరి ఓటును కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులందరిపై ఉందన్నారు. అలాగే పార్టీ డిజిటల్ మెంబర్షిప్ కార్యక్రమంతో సహా, పార్టీ బలోపేతానికి చేపట్టబోయే అన్ని కార్యక్రమాలను కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో విజయవంతం చేయాలన్నారు.
షాబాద్,చందన్ వెల్లి, సీతారాంపూర్లో గతంలో ఎకరం రూ.30 లక్షలుండేది.. కానీ అక్కడ తాము అధికారంలో ఉన్నప్పుడు ఇండస్ట్రియల్ పారిశ్రామిక పార్క్ తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఎకరం రూ.3 కోట్లకు తక్కువ షాబాద్లో లేని పరిస్థితి ఉండేదన్నారు కేటీఆర్. కానీ నేడు ఆ పరిస్థితి లేదన్నారు. వాస్తవమేంటంటే ఎన్నికలకు ముందు ఎకరం కోటి రూపాయలు పలికింది కూడా ఇవాళ కనీసం రూ.50 లక్షలు, రూ.60 లక్షలకు కూడా కొనేందుకు ఎవరూ సిద్దంగా లేరన్నారు. రాష్ట్రంలో దారుణమైన పరిస్థితిలో రియల్ ఎస్టేట్ రంగం ఉందన్నారు. ఎందుకీ ఈ పరిస్థితి వచ్చిందనేది ఆలోచన చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్షల మంది రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి పనిచేసుకునే తమ్ముళ్లు, చెల్లెళ్లందరూ ఇవాళ దివాళా తీసే పరిస్థితి వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి మరియు తదితర నాయకులు పాల్గొన్నారు.







