VGన్యూస్: రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, సొసైటీలు, విశ్వవిద్యాలయాలు, ఇతర ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బందికి ఆర్థిక శాఖ బుధవారం ఈ నెల మొదటి తేదీనే జీతాలు విడుదల చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ఈ చర్యలు చేపట్టింది. ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బందికి జీతాల చెల్లింపుల వివరాలపై ముఖ్యమంత్రి బుధవారం ఆర్థిక శాఖ అధికారులను ఆరా తీశారు. ఈ నెల బిల్లులు అందిన అన్ని విభాగాల ఉద్యోగులకు జీతాలు జమ చేసినట్లు ఆర్థిక శాఖ అధికారులు నివేదించారు. జీతాల చెల్లింపులో ఆలస్యం వల్ల ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, గౌరవ వేతనం ప్రాతిపదికన పనిచేస్తున్న సిబ్బందికి కూడా జీతాలు జాప్యం చేయకుండా అందాలని ఇటీవల సీఎం అధికారులను ఆదేశించారు. ప్రతి నెల 25వ తేదీలోగా జీతాలు, రెమ్యునరేషన్ బిల్లులను ట్రెజరీ, పే అండ్ అకౌంట్స్, అకౌంట్స్ విభాగాలకు సమర్పించాలని ఆర్థిక శాఖ ఆదేశించింది







