VGన్యూస్: ఫిల్మ్ నగర్లోని JRC కన్వెన్షన్లో జరిగిన ‘SPARSA – 2026’ వార్షిక సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సమాజ సేవకు అంకితమైన ‘టచ్ ఏ లైఫ్’ (Touch a Life Foundation) సంస్థ, మహిళల విద్య, స్కిల్ డెవలప్మెంట్ మరియు ఉపాధి అవకాశాల కల్పన ద్వారా వేలాది కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపుతోందని కొనియాడారు.
ఈ సమావేశంలో కేటీఆర్ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. తన 50వ పుట్టినరోజును పురస్కరించుకుని, ఆర్థికంగా వెనుకబడిన 50 మంది విద్యార్థినుల చదువు బాధ్యతను స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా ఎవరైనా అవసరంలో ఉన్నప్పుడు సహాయం చేయడం మానవత్వమని, భవిష్యత్తులో ప్రభుత్వ పరంగా కూడా ఇలాంటి సత్కార్యాలకు పూర్తి సహకారం అందిస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతే లక్ష్యంగా టచ్ ఏ లైఫ్ సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.







