Home తెలంగాణ ఓయూలో కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా పుస్తకాల పంపిణీ

ఓయూలో కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా పుస్తకాల పంపిణీ

VGన్యూస్: ఉస్మానియా యూనివర్సిటీ BRSV ఆధ్వర్యంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డా. గాదరి కిశోర్ కుమార్, BRSV రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓయూ(OU) ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో కేక్ కట్ చేసి, విద్యార్థులకు పుస్తకాలు, గొడుగులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో BRSY & BRSV నాయకులు నేవూరి ధర్మేందర్ రెడ్డి, వల్లమల్ల కృష్ణ, తోట్ల స్వామి, పడాల సతీష్, నాగారం ప్రశాంత్, నాగరాజు గౌడ్, రఘురాం, జంగం అవినాష్, కోతి విజయ్, శిగ వెంకట్, యుగంధర్ రెడ్డి, జిల్లా నాగయ్య, నవీన్ గౌడ్, శశిపాల్, పల్లయ్య, నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.