Home తెలంగాణ తెలంగాణ భవన్ లో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

తెలంగాణ భవన్ లో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

VGన్యూస్: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) 50వ జన్మదినోత్సవ వేడుకలను శనివారం తెలంగాణ భవన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ(BRSV) రాష్ట్ర కార్యదర్శి రాజేష్ నాయక్ ఆధ్వర్యంలో రూపొందించిన “నీ సాయం ప్రతి పేదవాడికి మనోధైర్యం” అనే డాక్యుమెంటరీ వీడియోను(Documentary Video) మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆవిష్కరించారు. అలాగే BRSV రాష్ట్ర కార్యదర్శి నాగారం ప్రశాంత్ రూపొందించిన రెండు నిమిషాల నిడివిగల డాక్యుమెంట్ మరియు BRS లీగల్ సెల్ అడ్వకేట్ చైతన్య కిరణ్ ఆధ్వర్యంలో గాయకులు మానుకోట ప్రసాద్, మద్దెల సందీప్ రూపొందించిన పాటను (Song) కూడా ఆవిష్కరించారు.                                                      అనంతరం ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాట్లాడుతూ..కేటీఆర్ ప్రజాసేవను రాజకీయాలకు అతీతంగా అవసరంలో ఉన్న ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తూ, యువతకు స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్నారు. ఆయన చేపట్టిన సేవా కార్యక్రమాలు సమాజంలో సానుకూల మార్పుకు దోహదపడుతున్నాయని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, బాల్క సుమన్, BRS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గ్యాదరి బాలమల్లు, BRSV రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, మాజీ కార్పొరేషన్ ఛైర్మన్లు చిరుమల్ల రాకేష్, రామచంద్ర నాయక్, కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, బీసీ కమిషన్ మాజీ సభ్యులు కే.కిశోర్ గౌడ్, రాష్ట్ర నాయకులు నంద్యాల దయాకర్ రెడ్డి, BRSY & BRSV నాయకులు నేవూరి ధర్మెందర్ రెడ్డి, పల్లా ప్రవీణ్ రెడ్డి, వల్లమల్ల కృష్ణ, పడాల సతీష్, జంగం అవినాష్, కోతి విజయ్, యుగంధర్ రెడ్డి, జిల్లా నాగయ్య, శిగ వెంకట్, నవీన్ గౌడ్, శశిపాల్, మిథున్, నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.