Home తాజా వార్తలు పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించిన మంత్రి సీతక్క

పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించిన మంత్రి సీతక్క

VGన్యూస్: సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని మంత్రి సీతక్క పరామర్శించారు. సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడి తెలుకున్నారు. ఆయనకు ఉత్తమ వైద్యం అందించాలని సీతక్క వైద్యులను కోరారు. ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి మంత్రి సీతక్క భరోసా ఇచ్చారు. అలాగే ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.