Home తాజా వార్తలు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత

VGన్యూస్: బీఆర్ఎస్ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గురువారం అర్ధరాత్రి 12.51 గంటలకు కన్నుమూశారు. ఈమేరకు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. ఈనెల 26న ఉదయం హనుమకొండలోని తన నివాసంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి తరలించారు. వైద్యులు గంటసేపు శ్రమించి తొమ్మిది సార్లు సీపీఆర్ చేశాక.. కొంత ఫలితం కనిపించడంతో మెరుగైన చిక్సిత కోసం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు వెంటిలేటర్ పై ఉంచి చిక్సితను అందించారు. చివరకు ఆయన గురువారం అర్ధరాత్రి కన్నుమూశారు.