Home తాజా వార్తలు కస్తూర్బా పాఠశాలలో ఘనంగా డిప్యూటీ సీఎం జన్మదిన వేడుకలు

కస్తూర్బా పాఠశాలలో ఘనంగా డిప్యూటీ సీఎం జన్మదిన వేడుకలు

VGన్యూస్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థి ఆరోగ్యంగా, ఆత్మవిశ్వాసంతో ఎదిగి రాష్ట్ర సంపదగా మారాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం మొయినాబాద్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV) విద్యార్థినుల మధ్య డిప్యూటీ సీఎం తన జన్మదినాన్ని జరుపుకున్నారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. విద్యార్థినుల మధ్య తన జన్మదినాన్ని జరుపుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. మన బిడ్డల భవిష్యత్తే తెలంగాణ భవిష్యత్తు.. అందుకే ప్రజా ప్రభుత్వం విద్యను అత్యంత ప్రాధాన్యతగా తీసుకుందన్నారు. రాష్ట్రంలోని 29 లక్షల మంది ప్రభుత్వ విద్యార్థులకు నేటి నుంచే అల్పాహార పథకాన్ని ప్రారంభించిందని పేర్కొన్నారు. అలాగే డైట్, కాస్మోటిక్ చార్జీల పెంపు, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం, మెరుగైన వసతులు, నాణ్యమైన విద్య ద్వారా ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేస్తున్నామన్నారు.