Home తాజా వార్తలు VOAల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి సీతక్క

VOAల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి సీతక్క

VGన్యూస్: మహిళా స్వయం సహాయక సంఘాల బలోపేతం, గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారతలో కీలక పాత్ర పోషిస్తున్న విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్ (VOAs) సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. ద‌న‌స‌రి అన‌సూయ సీతక్క స్పష్టం చేశారు.
ఖైరతాబాద్ ఆనంద్‌నగర్ కాలనీలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో VOAలతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన మంత్రి సీతక్క.. వారికి అందుతున్న సదుపాయాలు, విధి నిర్వహణలో ఎదురవుతున్న సవాళ్లు, భవిష్యత్ అవసరాలపై స్వయంగా అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా VOAల సమస్యలను ఓర్పుగా విన్న మంత్రి.. ప్రభుత్వం వారి సంక్షేమం, సేవా భద్రత, ఆర్థిక స్థిరత్వం కోసం పలు కీలక చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ స‌మావేశంలో సెర్ప్ సీఈఓ దివ్యా దేవ‌రాజ‌న్, సెర్ప్ డైరెక్టర్లు వైయ‌న్ రెడ్డి, న‌వీన్, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.