VGన్యూస్: రాష్ట్రంలో ఇటీవల నియమితులైన వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, వైస్ చైర్మన్లు సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారంతా తమకు అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే వారందరికీ కూడా సీఎం అభినందనలు తెలిపారు.







