VGన్యూస్: రాజ్యసభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురైంది. మధ్యప్రదేశ్ నుంచి ఆమె రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. మీనాక్షి నటరాజన్ తన అఫిడవిట్ లో కేసుల వివరాలు వెల్లడించలేదంటూ రిటర్నింగ్ అధికారికి భాజపా ఫిర్యాదు చేసింది. బీజేపీ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన రిటర్నింగ్ అధికారి.. కేసుల వివరాలు అఫిడవిట్ లో వెల్లడించలేదంటూ నామినేషన్ ను తిరస్కరించినట్లు సమాచారం.










