Home తాజా వార్తలు ఒకేసారి 5 శస్త్రచికిత్సలు.. ఉస్మానియా వైద్య సిబ్బందిని అభినందించిన సీఎం

ఒకేసారి 5 శస్త్రచికిత్సలు.. ఉస్మానియా వైద్య సిబ్బందిని అభినందించిన సీఎం

VGన్యూస్: ఏకబిగిన 36 గంటలపాటు శ్రమించి పేషంట్‌కు ఒకేసారి అయిదు శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించిన ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వైద్యులు, ఇతర సిబ్బందికి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. సిరిసిల్లకు చెందిన 30 ఏళ్ల యువ ఇంజినీర్‌కు జీర్ణాశయం, డ్యూడెనమ్, ప్యాంక్రియాస్, చిన్నపేగు, పెద్దపేగు అవయవాలను ఒకేసారి మార్పిడి చేసి దేశంలోనే అరుదైన రికార్డును సాధించారని పేర్కొన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవం రోజున ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వైద్య బృందం ఈ విజయాన్ని సాధించి వైద్య వృత్తికి మరింత ఆదర్శంగా నిలిచారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసించారు.