VGన్యూస్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య 93వ జయంతి సందర్భంగా శాసనసభ మెంబర్స్ లాంజ్ లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తెలంగాణ రాష్ట్ర శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ ఛైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు మరియు శాసనమండలి కార్యదర్శి డా. వి. నరసింహా చార్యులు, శాసనసభ కార్యదర్శి రేండ్ల తిరుపతి, అధికారులు. ఈ సందర్భంగా రోశయ్య చేసిన సేవలను గుర్తు చేసుకొని కొనియడారు.










