Home తాజా వార్తలు తెలంగాణ మా అయ్యల జాగీరే: వెన్నెల

తెలంగాణ మా అయ్యల జాగీరే: వెన్నెల

VGన్యూస్: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ రోజున ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలను గద్దర్ కుమార్తె వెన్నెల ఖండించారు. ఈ సందర్భంగా వెన్నెల మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ను నటుడిగా, గద్దర్ అభిమానిగా గౌరవిస్తామన్నారు. పొత్తులు కుదుర్చుకుంటేనో.. పైసలు పంచితేనో.. లాబీలు చేస్తేనో తెలంగాణ రాలేదన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎందరో తెలంగాణ బిడ్డలు ప్రాణత్యాగాలు చేశారని పేర్కొన్నారు. వారి త్యాగాల ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. తెలంగాణ గడ్డ.. నిన్న మా అయ్యల జాగీరే.. నేడు మా జాగీరు.. రేపు మా బిడ్డల జాగీరు అని వెన్నెల స్పష్టం చేశారు.