VGన్యూస్: తెలంగాణలో ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన టీజీ లాసెట్(TG Lawcet) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఎల్‌ఎల్‌బీలో ప్రవేశానికి జులై 5 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందని లాసెట్ ప్రవేశాల కన్వీనర్ ప్రొఫెసర్ ఐ.పాండురంగారెడ్డి షెడ్యూల్ ను విడుదల చేశారు.
ఎల్‌ఎల్‌బీ కౌన్సెలింగ్ షెడ్యూల్ వివరాలు:
జులై 5 నుంచి 10వ తేదీ వరకు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్
జులై 16 నుంచి19వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు
జులై 24న సీట్ల కేటాయింపు
ఎల్ఎల్ఎం కౌన్సెలింగ్ షెడ్యూల్ వివరాలు:
జులై 27 నుంచి 31 వరకు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్
ఆగస్టు 1 నుంచి 2వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు
ఆగస్టు 5న సీట్ల కేటాయింపు.










