Home క్రీడలు & సినిమా మెదక్ ఫాల్కన్స్ పై హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ విజయం

మెదక్ ఫాల్కన్స్ పై హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ విజయం

VGన్యూస్: టీజీ20 లీగ్ లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ హ్యాట్రిక్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. శనివారం మెదక్ ఫాల్కన్స్ తో జరిగిన మ్యాచ్ లో 46 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లను కోల్పోయి 240 పరుగులు చేసింది. ఈ ఛాంపియన్ బ్యాటర్లు సాయివికాస్ రెడ్డి 48 బంతుల్లో 93, అభిరథ్ రెడ్డి 27 బంతుల్లో 59 పరుగులతో రాణించారు. 241 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మెదక్ ఫాల్కన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లను కోల్పోయి 194 పరుగులకే పరిమితమైంది. మెదక్ బ్యాటర్లు విక్రమ్ నాయక్ 75, వరుణ్ 38, రవితేజ 31 పరుగులు చేశారు. మెదక్ ఫాల్కన్స్ కు వరుసగా ఇది మూడో ఓటమి.