VGన్యూస్: బీజేపీ 9 జిల్లా కార్యాలయాలను ఆదివారం ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ప్రారంభించారు. రంగారెడ్డి రూరల్ జిల్లా కార్యాలయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావుతో కలిసి ప్రారంభించారు. అదే విధంగా రాష్ట్రంలోని నూతనంగా నిర్మించిన మరో 8 జిల్లా కార్యాలయాలను వర్చువల్ గా ప్రారంభించారు. ఈ నూతన కార్యాలయాలు ప్రతి కార్యకర్తకు సేవా కేంద్రాలుగా, ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికలుగా, వికసిత్ తెలంగాణ సాధనకు కార్యాచరణ కేంద్రాలుగా నిలవనున్నాయని నితిన్ నబిన్ అన్నారు.







