Home తాజా వార్తలు విద్యార్థుల పోరాటానికి కేంద్రం తలొగ్గక తప్పలేదు: కల్వకుంట్ల కవిత

విద్యార్థుల పోరాటానికి కేంద్రం తలొగ్గక తప్పలేదు: కల్వకుంట్ల కవిత

VGన్యూస్: విద్యార్థుల 36 రోజుల ఉజ్వల పోరాటానికి కేంద్రం దిగిరాక తప్పలేదని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(TRS) అన్నారు. తప్పని పరిస్థితుల్లో కేంద్రమంత్రి రాజీనామా చేయాల్సిని స్థితి తెచ్చారన్నారు. ఈ విజయం పూర్తిగా విద్యార్థులదే అని స్పష్టం చేశారు. విద్యార్థుల విజయాన్ని తాము సాధించినట్లు దాదాపు మూడు నాలుగు గంటల పాటు నగరంలో కొవ్వొత్తులు పట్టకొని సీఎం(CM) సహా కాంగ్రెస్ నాయకులంతా ఊరేగి ఈ విజయాన్ని తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ విద్యార్థులకు ఎన్నో హామీలిచ్చి మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ ను విద్యార్థులు ఎక్కడ నిలదీస్తారోనని ముందుగానే ముఖ్యమంత్రి బయటకు వచ్చి ఊరేగింపులు చేస్తున్నారని కవిత ఆరోపించారు. ఇకనైనా యువతకు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఇదే యువత మిమ్మల్ని గద్దె దించుతారని కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) హెచ్చరించారు.