Home తాజా వార్తలు స్వయం సహాయక సంఘాలకు రుణాలివ్వాలి: సీఎం రేవంత్ రెడ్డి

స్వయం సహాయక సంఘాలకు రుణాలివ్వాలి: సీఎం రేవంత్ రెడ్డి

VGన్యూస్: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మంగళవారం ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలో జరిగిన కార్యక్రమంలో హెచ్‌డీఎఫ్‌సీ సమకూర్చిన రెండు ఆంబులెన్స్‌లకు సీఎం జెండా ఊపి ప్రారంభించారు. భూపాలపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన ఎంఆర్ఐ స్కానర్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి బ్యాంకు ప్రతినిధులతో మాట్లాడుతూ.. స్వయం సహాయక సంఘాలతో లాజిస్టిక్ పార్కులు, గోడౌన్లు, రైస్ మిల్లులు ఏర్పాటు చేస్తున్నామని, అందుకోసం పెద్ద ఎత్తున రుణాలివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఉన్నతాధికారులు పాల్గొన్నారు