Home తాజా వార్తలు తెలంగాణ భవన్ వద్ద కేటీఆర్ ను అడ్డుకున్న పోలీసులు

తెలంగాణ భవన్ వద్ద కేటీఆర్ ను అడ్డుకున్న పోలీసులు

VGన్యూస్: కాంగ్రెస్ మంత్రుల సవాల్ స్వీకరించి తెలంగాణ భవన్ నుంచి గన్ పార్క్‌కు బయలుదేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ గేటు వద్ద కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి జూపల్లి కృష్ణారావుతో చర్చ కోసం గన్ పార్క్ బయలుదేరితే పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకోవడం దుర్మార్గం అని అన్నారు. అక్కడ కూర్చుని మంత్రులు సవాళ్లు విసరడం.. ఇక్కడ పోలీసులతో మమ్మల్ని అడ్డుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని కేటీఆర్ మండిపడ్డారు. కంచన్‌బాగ్‌కు వెళ్లి, అక్కడ అరెస్ట్ అయిన తమ బీఆర్ఎస్ నేతలను పరామర్శిద్దామని అనుకుంటే.. గేటు నుంచి అడుగు బయట పెట్టకుండా భారీగా పోలీసులను మోహరించారని పేర్కొన్నారు.