VGన్యూస్:అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలోని బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించనున్న19వ ఆటా మహాసభలకు హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డిని అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ప్రతినిధులు ఆహ్వానించారు. సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఆటా ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ ఆటా తెలుగు మహాసభలు జూలై 31 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు సీఎంకు తెలిపారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో మంత్రి జూపలి కృష్ణారావు,ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు జయంత్ చల్లా, నేషనల్ కో-ఆర్డినేటర్ శరత్ వేముల, కాన్ఫరెన్స్ రీజినల్ కో-ఆర్డినేటర్ తిరుమల రెడ్డి, ఈశ్వర్ బండా, ప్రవీణ్ పాల్ రెడ్డి తదితరులు ఉన్నారు.









